శిల్పారామం
సంక్రాంతి రోజు శిల్పారామం కి వెళ్ళాము.. పండగ సంబరాలు అంతానిండుగా, కన్నుల పండుగ గా ఉన్నాయి... అంతా తిరిగాము... సాంప్రదాయవస్ర్టాల పోటీలు కూడా జరిగాయి... పట్టణ జీవితాలలో సాంప్రదాయల వాసనలు నింపాలని చిన్ని ప్రయత్నాలు... అక్కడ దొరికే జొన్నరొట్టె లాగా రుచిగా ఉన్నాయి... పల్లెలలో ఉండే చేతివ్రుత్తుల వారి ఇళ్లు, పనిముట్లు, అన్నీ వారి ఇళ్ళలో చూపించే ప్రయత్నం, మా అమ్మకి బాగా నచ్చింది... చేటలని కూడా అలంకరణకి ఉపయోగించే రొజులు వచ్చాయని, మా అమ్మ ఆశ్చర్యపోతోనే, ఆనందపడింది... కాళహాస్తివాళ్ళు చెసిన చెక్కబొమ్మలు కొన్నాం... జొన్నరొట్టెలు తిన్నాం...
బయిటకి వచ్చాకా, రాజస్తానీ కళాకారులు చేసిన చెక్క గణపతి బొమ్మ కొన్నాం... చీకటిలో కొన్న బొమ్మ ఎలా ఉంటుందో అనుకున్నాను.. ఈ బొమ్మ ఈ చిత్రంలో చూడండి... గణపతి కి గోవింద నామం ఉడడం తర్వాత గమనించాను... కొచెం చిత్రమైన ఆలోచన కళాకారునికి...
రామచంద్రుని మనో ధర్మం
Thursday, 15 January 2009
Subscribe to:
Post Comments (Atom)
పట్నవాసపు గజిబిజిలో కాస్తో కూస్తో ఊరట కలిగించేది ఇక్కడ శిల్పారామమే! స్టాళ్ళు, సేళ్ళు(sales) సంగతి అలా ఉంచి బొమ్మల మ్యూజియం, సంప్రదాయ వేదిక మీద కార్యక్రమాలు, సంప్రదాయ వంటకాలు,గోరింటాకు ఇలాంటివి పిల్లలకు కూడా నచ్చుతాయి. వినాయక చవితి సమయంలో మట్టితో వినాయకుడిని చేయడం మీద పిల్లలకు పోటీలు కూడా ఉంటాయి. పండగలు,హస్తకళల మేళాలు జరిగినపుడు మన తెలుగు సంప్రదాయ రీతులైన, వీధి నాటకాలు, చెక్క భజనలు,పగటివేషాలు,డప్పులు వంటి కళా ప్రదర్శన కూడా ఉంటుంది. నిన్న సంక్రాంతికి కూడా బాగానే హడావుడి చేసారు. మరిన్ని ఫొటోలు పెట్టవలసింది మీరు.
ReplyDelete