Tuesday, 2 February 2016

అలవాటు లేని ఔ పోసన చేస్తే మీసాలు కాలాయి...

చాల రోజుల తర్వాత, సంవత్స్త రాల తర్వాత బ్లాగ్ లోకి మళ్లి తొంగి  చుసాను...  స్థబ్ద మైన బావిలో నీరు నిశ్చలం గా ఉన్నట్లు , నా బ్లాగ్ నిశ్చలం గా ఉంది ... మళ్ళి ఆలోచనల స్రవంతి ఈ బ్లాగ్ లోకి తెవాలి...  అ, ఆ, ఇ, ఈ లు మళ్ళి దిద్దాలి ... అలవాటు లేని ఔపోసన....  మళ్ళి ఈ బ్లాగ్ లోకి తొంగి చూడడానికి ప్రేరణ - బ్లాగ్  రచయత్రులు ...  బ్లాగ్ తో మొదలుపెట్టి, మంచి రచయత్రులుగా ఎదుగుతున్నరు... వారి ప్రభావం నాపై పడింది ...  మళ్లి మొదలైంది ప్రయాణం       

Tuesday, 15 March 2011

ముంగిట్లో కమాలాలు, కలువలు

ముంగిట్లో కమాలాలు, కలువలు


కొత్త ఇంట్లో కి వెళ్ళాక, కొత్త జీవితం వచ్చినట్లు అయింది. ఇప్పటినించో ముంగిట్లో కలువలు, కమాలాలు ఉండాలని ఉండేది. రెండు కుండీ లలో, కడియం నుండి తెచ్చిన కలువల, కమలాల దుంపలు నాటం. వీటిని అక్క వీటిని తెచ్చింది, కడియం నుండి. ముందర కుండిలను మూలగా ఉంచాము. పెద్దగా మార్పు లేదు. తరవాత, ఆ కుండిలను, సింహద్వారం ఎదురుగా ఎండ లో ఉంచాము. ఎండలో కమాలాలు విరిశాయి. మూడు రంగులలో .... చూడముచ్చటగా ఉన్నాయి. రోజూ ఈ కమాలాలని చూడాలని ఆత్రం గా ఉంతుంది. ఇళ్ళలో కమలాలు, కలువలు తక్కువ. ఎందుకు?

రామ చంద్రుడు

Thursday, 10 June 2010

తెలుగు లో టైపు చేయడం మరింత సులభం గా ఉంది. చాల రూజుల తర్వాత నా మనో ధర్మం లోకి తొంగి చూసాను. దీనికి కారణం సుభాష్. సుభాష్ సాందీపని విద్యాలయం లో చదువుతున్న విద్యార్ధి. తొమ్మిదో తరగతి చదువు తున్నాడు. సబ్బు నీళ్ళని ఎలా శుభ్రపరచాలని ఆలోచనలో ఉన్నాడు. నా కా ర్యా లయానికి వచ్చి, నన్ను మీరు ఏమి చేస్తారు ? మీ కార్యకలాపాలు ఏమిటి? అని తిన్నగా అడిగాడు. నాకు చాల ముచ్చటేసింది. ఇంత చిన్న పిల్లడు, ఎంత కుతూహలం గా ఉన్నదో అనిపించింది. నేను ఇదివరకు ఈ బ్లాగ్ లో ఉంచిన కుండ తో తాగు నిటి ని పరిశుభరం చేసే విధానాన్ని చుపిద్దామని మరల బ్లాగ్ లోకి వచ్చాను. అసలు దిని గురించి మర్చి పోయాను. రాము

Sunday, 1 February 2009

కొత్త బొమ్మలు

పాత బొమ్మలన్నీ తీసేసి, కొత్త బొమ్మలు పెడుతున్నాను...

రామచంద్రుని మనోధర్మం

Saturday, 31 January 2009

మంచి నీరు

ఈ రోజు కుండ తో నీళ్ళ ఫిల్టర్ చేయడం గురించి నేను, భరణి చేసిన ప్రయోగం గురించి రాద్దామనిపించిది.

గులక రాళ్ళు (కంకర), ఇసక, బొగ్గు శుభ్రంగా కడిగి, ఎండ పెట్టాలి.
కుండలు మూడు కొని, నీళ్ళతో కడిగి శుభ్రపరచు కోవాలి. కింద పెట్టే కుండకి కుళాయి ఉండాలి.
మధ్య ఉన్నకుండకి అడుగున చిన్న చిల్లు చేయలి. ఆ తర్వాత, ముందుగా, పెద్దగా ఉన్న కంకర రాళ్ళు పరవాలి. (రెండు లేక మూడు అంగుళాలు). తర్వాత, బొగ్గులని పరవాలి. (రెండు నుండి నాల్గు అంగుళాలు). ఆ తర్వాత, ఇసక ని పరవాలి. కుండలో ఎక్కుఅవ భాగం ఇసకతో నే నింపాలి. (పన్నెండు నుండి ఇరవయి అంగుళాలు). ఆపయిన, కొన్ని గులక రాళ్ళని పరవాలి.
పయిన ఉంచిన కుండకి చిన్న చిల్లు చేసి, మధ్య ఉన్న కుండ మీద ఉంచాలి.

పయిన ఉన్న కుండలో, నీళ్ళు పోయలి. ఈ కుండకి ఉన్న చిల్లు ద్వారా, నీళ్ళు చుక్క చుక్క గా, కింద ఉన్న కుండలోకి జారతాయి. మధ్య ఉన్న కుండలొ ఉన్న ఇసక, బొగ్గు, కంకర ల ద్వ్రారా, నీళ్ళు శుభ్రపడుతూ, మెల్లిగా కింద ఉన్న మూడో కుండలోకి జారతాయి. మూడొ కుండకి ఉన్న కుళాయి ద్వారా నీళ్ళని చెంబు లోకి పట్టుకో వచ్చు.

ఇసక తొ పనిచేసే ఫిల్టర్ అన్ని ఫిల్టర్ల కన్నా, సమర్ధవంతంగా పని చేస్తుంది. మంచి నీరుకి ఇదో సులభమైన, అందరూ చేసుకోగలిగిన పని ఇది. గాంధిగారు కూడా దీన్ని ఉపయోగించేవారు......

రామచంద్రుని మనొధర్మం
1 ఫిబ్రవరి 2009

Tuesday, 20 January 2009

కళారాధన

స్పిక్ మాకి (Society for Promotion of Indian Classsical Music and Culture Among Youth - SPICMACAY) - ఒక స్వఛ్చంద సంస్ధ. యువతలో భారత కళల పయి మక్కువ పెంచడానికి ఈ సంస్థ పని చేస్తోంది. ఇంచు మించు 25 సంవత్స్రరాలనుండి విశ్వవ్యాప్తిగా పని చేస్తోంది. ప్రఖ్యాతి గాంచిన కళాకారులు విద్యార్ధుల తో గడుపుతారు. బడిలో, సళాశాలలో ప్రదర్శనలిస్తారు. వాళ్ళడిగిన ప్రశ్నల కి జవాబులు చెపుతారు... కళల గురించి చెపుతారు. ఇందువల్ల యువతకి భారతీయ కళల పయి మంచి అవగాహన వస్తుంది. మన కళలని నేర్చుకోవాలని, సాధన చేయాలని కోర్కె కల్గుతుంది. కనీసం ఆ కళ పై ఆసక్తి కలుగు తుంది. విద్యార్ధి గా ఉన్నప్పు డే మంచి కళాకారులని చూసే, వినే, మాట్లాడే, ప్రశ్నించే అవకాశం కలుగుతుంది. ప్రేరణ కలుగుతుంది.

నేను అహ్మదాబాదు లొ చదువుతున్నప్పుడే, పెద్ద పెద్ద కళాకారులని చూసే, వినే, మాటాడే అవకాశం దొరికింది. భీంసేన్ జోఃసి, లీలా సాంసన్, విశ్వమోహన్ భట్, హరి ప్రసాద్ చౌరాసియా, లాల్గుడి జయరామ్, మల్లికా శరభయి లాంటి కళాకారుల ప్రదర్శనలని చూసాను. కళల పయి మరింత గౌరవం పెరిగింది. మరింత అవగాహన, ఆప్యాయత పెరిగాయి. ఎంత అద్రుస్టం అనుకున్నాను... మరో నేత్రం మనసులో తెరుచుకుంది. చెవులకు కొత్త గా ధ్వనులు వినబద్దాయి... నేను చెన్ననాడే నేర్చుకున్న సంగీతం మరింత మధురమయిన మిత్రమయింది... రాగాలు, స్వరాలు, పాటలు, మరింత చేరువయ్యాయి...

నిన్న విరాసత్ 2009 లొ, స్పిక్ మాకి వారి ఆర్ధ్వర్యం లో జరిగిన పండిత్ హరి ప్రసాద్ చౌరాసియా మురళి, శివం గారి నాదస్వరం చూసాను... చిన్నారులంతా ఆసక్తిగా విన్నారు... ప్రశ్నలడిగారు... చల్లని శీతాకాలమ్... చలిలొ... ప్రశాంతమయిన వాతావరణంలో, వేణునాదం ఎంత మధురం గా ఉందో.... స్పిక్ మాకి గురించి, వారి వెబ్ లో చూడవచ్చు... వారికి మరింత ధన్యవాదాలు....

రామచంద్రుని మనోధర్మం

Friday, 16 January 2009

చిత్రమయిన చిత్రాలు

గోపాళమ్ గార్కి, రాధిక గార్కి, మధురవాణి గార్కి,

మీ అందరి వ్యాఖ్యలూ చదివాను. అంతర్జాలం చాలా మెల్లిగా పని చేస్తొండడం వల్ల అన్ని చిత్రాలు పెట్టలేక పోయాను... మీ ఆత్రానికి చాలా ముచ్చటేసింది. మళ్ళీ సంక్రాంతొచ్చిందన్నంత ఆనందంతో మరిన్ని చిత్రాలని జోడిస్తున్నాను..

రామచంద్రుని మనోధర్మం